గ్రీన్ వీసాదారులకు యూఏఈ శుభవార్త తెలిపింది. గ్రీన్ వీసా కలిగి ఉన్న భారతీయులకు అలాగే ఇతర దేశాలకు చెందిన వాళ్ళు ఇంతకుముందు రెండేళ్ల పాటు మాత్రమే నివాస హోదా కలిగి ఉండేవాళ్ళు. కానీ తాజాగా యూఏఈ సవరించిన వీసాల వల్ల గ్రీన్ వీసా కలిగి ఉన్నవాళ్లు అయిదేళ్ల పాటు యూఏఈ లో నివాస హోదా కలిగి ఉండొచ్చు.
యూఏఈ వీసా నిబంధనలను సవరించడంతో ఆ దేశంలో ఉంటున్న భారతీయులతో పాటుగా ఇతర దేశాల వాళ్లకు కూడా ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. ఇక పర్యాటక వీసా పై వెళ్ళేవాళ్ళు 90 రోజులు మాత్రమే ఉండాల్సి వచ్చేది ఇప్పుడా గడువు మరో 90 రోజులు పొడిగించింది యూఏఈ ప్రభుత్వం.