
Telugu Association of North America ( TANA) ప్రతినిధులకు Ublood app సగౌరవంగా విందు ఏర్పాటు చేసింది. ఈ విందు కార్యక్రమం డిసెంబర్ 24 రాత్రి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఏర్పాటు చేశారు. ఉండవల్లి కరకట్ట పక్కనే ఉన్న ధర్మ నిలయం గెస్ట్ హౌజ్ లో ఈ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తానా ప్రతినిధులు అలాగే యు బ్లడ్ కుటుంబ సభ్యులు , మిత్రులు పాల్గొననున్నారు. యు బ్లడ్ యాప్ తక్కువ సమయంలోనే ఎక్కువ ప్యాచుర్యం పొందడానికి యువకులు , ప్రజలతో పాటుగా తానా ప్రతినిధులు కూడా కారణం.
పైగా అమెరికాలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా తానా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దాంతో వారి గౌరవార్థం ఈ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తానా బృందంతో పాటుగా గుంటూరు జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ , బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతురి నాగభూషణం తదితరులు పాల్గొననున్నారు. UBlood app ఫౌండర్ & ఛైర్మన్ డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి, యలమంచిలి కృష్ణమూర్తి, యలమంచిలి రమేష్ బాబు తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.