
ప్రముఖ పారిశ్రామిక వేత్త , UBlood app సృష్టికర్త జై యలమంచిలిని సత్కరించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే. నవంబర్ 20 న ముంబై లోని తాజ్ హోటల్ లో ” Society Achievers ” సన్మాన కార్యక్రమం జరిగింది. కాగా ఆ వేడుకకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే , డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్య అతిథులుగా హాజరు కావడం విశేషం. సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేసిన పలు రంగాలకు చెందిన వాళ్లను ఘనంగా సన్మానించారు. జై యలమంచిలి UBlood app ఫౌండర్ అనే విషయం తెలిసిందే.
సమయానికి రక్తం అందక చాలా ప్రాణాలు పోతుండటంతో అలాంటి పరిస్థితి భవిష్యత్ లో రాకూడదు అనే సంకల్పంతో UBlood ఆప్ ను రూపొందించారు. ఇక ఇంతటి మహోన్నత కార్యక్రమానికి అభినవ దాన కర్ణుడు గా పేరు గాంచిన సోనూ సూద్ అయితేనే బాగుంటుందని భావించి అతడ్ని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకున్నారు జై యలమంచిలి.
దాంతో తక్కువ సమయంలోనే ఈ యాప్ కు విశేషమైన ప్రాచుర్యం లభించింది. ఇక ఇప్పుడేమో ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమక్షంలో అవార్డ్ లభించడంతో చాలా చాలా సంతోషిస్తున్నారు జై యలమంచిలి. ఇదే కార్యక్రమంలో నటులు సోనూ సూద్ కూడా పాల్గొన్నారు. జై చేపట్టిన గొప్ప కార్యక్రమానికి నేను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం నాకు మరింత సంతోషం కలిగించే అంశమన్నారు.ఆజాదీకా అమృత్ మహోత్సవం లో భాగంగా ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.