
అమెరికాలోని ఎడిసన్ లో సాయిదత్త పీఠంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. తెలుగువారికి చాలా ఇష్టమైన పండగ , అందునా తెలుగు సంవత్సరాది పండగ కావడంతో సాంప్రదాయ సిద్ధంగా ఈ వేడుకలను నిర్వహిస్తుంటారు. ఖండాంతరాలను దాటినప్పటికీ సంప్రాదయాలను పాటించడంలో తెలుగు రాష్ట్రాలలో ఉండే తెలుగువాళ్ళ కంటే ప్రవాసాంధ్రులే మిన్న అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు సుమా !
తెలుగు పండగలను అత్యంత నియమ నిష్ఠలతో జరుపుకుంటారు. పిల్లలు , పెద్దలు , యువతీయువకులు అనే తేడా లేకుండా సకుటుంబ సపరివార సమేతంగా అంటూ అందరూ ఈ వేడుకలలో పాల్గొంటారు. తెలుగుతనాన్ని ప్రతిబింభించేలా , మరింత ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా సగర్వంగా నిలుస్తారు. శంకరమంచి రఘు శర్మ ఆధ్వర్యంలో సాయి దత్త పీఠంలోని శ్రీ శివ విష్ణు టెంపుల్ లో ఉగాది వేడుకలు జరిగాయి. కాగా ఈ వేడుకలలో UBlood App సృష్టికర్త , JSW & Jaiswaraajya.tv సంస్థల శ్రేయోభిలాషి డాక్టర్ జై యలమంచిలి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అలాగే JSW & Jaiswaraajya.tv సంస్థల గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ లతో పాటుగా పలువురు తెలుగు వాళ్ళు కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం ఆసక్తిగా విన్నారు….. ఉగాది పచ్చడిని ఆస్వాదించారు.
ఫోటోలు : డాక్టర్ శివకుమార్ ఆనంద్.






