29.6 C
India
Sunday, April 20, 2025
More

    Ugadi celebrations : అంగరంగ వైభవంగా సింగపూర్‌లో టీసీఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు

    Date:

    Ugadi celebrations
    Ugadi celebrations

    Ugadi celebrations in Singapore : సింగపూర్‌లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఆదివారం నాడు ఫొటోన్గ్‌ పాసిర్‌లోని శ్రీశివదుర్గ ఆలయంలో జరిగిన ఈ వేడుకల్లో సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేరి కృష్ణ శర్మ పంచాంగ పఠనం చేశారు. అనంతరం శ్రీశైల దేవస్థానానికి చెందిన సిద్ధాంతి బుట్టే వీరభద్ర రచించిన గంటల పంచాంగాన్ని సభ్యులకు అందజేశారు. ఈ వేడుకల్లో 300 మందికి పైగా తెలుగువారు ఉత్సాహంగా పాల్గొన్నారు. నిస్వార్థంగా టీసీఎస్‌ఎస్‌ నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకమని భక్తులు ప్రశంసించారు.

    ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ప్రాంతీయ కార్యదర్శులు సంతోశ్‌ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్, సంతోశ్‌ కుమార్ జూలూరి, ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు సమన్వయకర్తలుగా వ్యవహరించారు.

    ఉగాది వేడుకల విజయానికి సహకరించిన దాతలు, స్పాన్సర్‌లు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ టీసీఎస్‌ఎస్‌ అధ్యక్షులు గడప రమేశ్‌ బాబు, కోశాధికారి నంగునూరి వెంకట రమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీశ్‌ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.

    ఈ వేడుకల్లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న వైఎస్‌వీఎస్‌ఆర్‌ కృష్ణ (పాస్‌పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్)కు అధ్యక్షులు గడప రమేశ్‌ బాబు మరియు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ వేడుకలు ఘనంగా జరగడానికి తమవంతు సహాయం అందించిన మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్ మరియు సౌజన్య డెకార్స్‌ సంస్థలకు సొసైటీ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

    Share post:

    More like this
    Related

    Bigg Boss : ఏడాది ‘బిగ్ బాస్’ షో లేనట్టేనా..? నిరాశలో ఫ్యాన్స్..కారణం ఏంటంటే!

    Bigg Boss : ప్రతీ ఏడాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే హిందీ బిగ్...

    Pushpa 2 : ఇదేమి ట్విస్ట్ : ‘పుష్ప 2’ మొత్తం మాయేనా..? సంచలనం రేపుతున్న వీడియో!

    Pushpa 2 : పుష్ప 2' సినిమాకు సంబంధించిన తాజాగా విడుదలైన VFX...

    JEE Main : జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదల: 24 మందికి 100 పర్సంటైల్

    JEE Main : జేఈఈ (మెయిన్) 2025 సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి...

    Infosys : ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ : 20వేల కొత్త నియామకాలు..!

    Infosys Jobs : దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ 2026 ఆర్థిక సంవత్సరంలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tantex Ugadi Celebrations : తెలుగుదనం ఉట్టిపడేలా.. టాంటెక్స్ ఉగాది సంబురాలు..

    Tantex Ugadi Celebrations : 2024, క్రోధినామ ఉగాది వేడుకలు ఫ్రిస్కో...

    Ugadi Celebrations : NJTA ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు..

    Ugadi Celebrations : ఉత్తర అమెరికా మరియు భారతీయుల మధ్య వారధిగా...