భారత సంతతికి చెందిన వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతూనే ఉన్నారు. ఆయా దేశాల్లో కీలక హోదాలలో పని చేస్తున్నారు. తాజాగా న్యూయార్క్ లోని ఎడిసన్ లో అలాంటి అరుదైన అవకాశం భారత సంతతికి చెందిన ఉజ్వల్ కు లభించింది. ఎడిసన్ లోని సాంస్కృతిక కళల అధికార సభ్యుడిగా ఉజ్వల్ కుమార్ కాస్థలను నియమించారు.
ఉజ్వల్ గత పదేళ్లుగా ఎడిసన్ లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో కీలక పాత్ర పోషించాడు ఉజ్వల్. దాంతో అతడికి కీలక పదవి లభించడం పట్ల భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. న్యూజెర్సీ లోని ఎడిసన్ లో ఎక్కువగా భారతీయులు అందునా తెలుగువాళ్లు ఉంటారనే విషయం తెలిసిందే.