కరోనా కష్టకాలంలో యావత్ భారతాన వినిపించిన ఏకైక పేరు సోనూ సూద్. వలస కార్మికులకు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఆపదలో ఉన్నామని సహాయం కోసం అర్ధిస్తే నేనున్నాను అంటూ ఆపన్న హస్తం అందించిన మహనీయుడు సోనూ సూద్. దాంతో ప్రపంచ వ్యాప్తంగా సోనూ సూద్ సేవలను కొనియాడుతూ అతడికి అండగా నిలుస్తున్నారు.
తాజాగా అమెరికాలో సోనూ సూద్ తన ఫౌండేషన్ కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టగా ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున దాతలు ముందుకు వచ్చి సోనూ సూద్ నిర్వహిస్తున్న ఫౌండేషన్ కు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని అమెరికాలో JSW అండ్ Jai Swaraajya అడ్వైజర్, U Blood app ఫౌండర్ జగదీప్ యలమంచిలి , JSW అండ్ Jai Swaraajya డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ ల సమక్షంలో నిర్వహించారు.