
అమెరికాలోని యునైటెడ్ ఫర్నిచర్ సంస్థ భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించింది. దాంతో షాక్ కు గురయ్యారు సదరు ఉద్యోగులు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పలు సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో యునైటెడ్ ఫర్నిచర్ కూడా చేరింది. తాజాగా 2700 మంది సిబ్బందిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఒక్కసారిగా 2700 మంది ఉద్యోగులను తొలగించడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకు తొలగిస్తున్నారు అనే విషయాన్ని వెల్లడించలేదు కానీ ఆర్ధిక మాంద్యం వల్లే ఈ పరిస్థితి అని మాత్రం స్పష్టం అవుతోంది.