మైఖేల్ జాక్సన్ ……. ఈ పేరు అంటే తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు సుమా ! యావత్ ప్రపంచాన్ని తన పాటలతో , డ్యాన్స్ లతో ఉర్రూతలూగించిన సమ్మోహన శక్తి. ప్రపంచ యవనికపై ఓ తారాజువ్వ మైఖేల్ జాక్సన్. ఇతడి షో కోసం అభిమానులు ఎంతగా పడి చచ్చేవారంటే మాటల్లో వర్ణించలేనంతగా ఆతృత పడేవాళ్ళు…… తమ ఊపిరి….. మైఖేల్ జాక్సన్ అనేంతగా అభిమానులు ఉన్నారు.
అయితే ఇంతటి గొప్ప సింగర్ , రైటర్ , డ్యాన్సర్ అయిన మైఖేల్ జాక్సన్ ఎన్ని సంవత్సరాలు బ్రతకాలని అనుకున్నాడో తెలుసా …… ఏకంగా 150 సంవత్సరాలు. అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే.
ఎందుకంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపొందిన రోజులు కావడంతో….. వైద్యరంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో మనం బ్రతకాగలిగే రోజులను పెంచుకునే సౌలభ్యం మన చేతుల్లో ఉందని, అందుకు డబ్బు ఖర్చు చేయడం ఒక్కటే పని అని భావించి తన శరీర నిర్మాణంలో ఎలాంటి లోపాలు ఉన్నాయో తెలుసుకొని ఆయా భాగాల కోసం మనుషులను కూడా మాట్లాడి పెట్టుకున్నాడు. తన ఆరోగ్యాన్ని కాపాడటానికి 12 మంది డాక్టర్ల బృందాన్ని నియమించుకున్నాడు. అలాగే తన అవసరాల కోసం , వ్యాయామం కోసం 15 మంది బృందాన్ని నియమించాడు. అలాగే పెద్ద ఎత్తున సేవా సిబ్బందిని కూడా నియమించుకున్నాడు. తనకు అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళ బాగోగులు కూడా మైఖేల్ జాక్సన్ చూసుకునే వాడు.
ఇన్ని జాగ్రత్తలు ఎందుకంటే తాను ఖచ్చితంగా 150 సంవత్సరాలు బ్రతకాలని. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ….. ఎంతమందిని పెట్టుకున్నా చివరకు 50 ఏళ్ల వయసుకె తనువు చాలించాడు. అంటే కేవలం విధి రాత మాత్రమే. మనం తలిచేది ఒకటైతే ఆ భగవంతుడు తలిచేది మరొకటని ఊరికే అన్నారా మన పూర్వీకులు. తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది కానీ విధిని ,విధాతను ఎదిరించడం ఎవరికీ సాధ్యం కాదని ఇలాంటి సంఘటనలు ఎన్నో రుజువు చేస్తూనే ఉన్నాయి. మైఖేల్ జాక్సన్ జూన్ 25 , 2009 లో అర్దాంతరంగా కన్నుమూశాడు. యావత్ ప్రపంచం శోక సంద్రంలో మునిగింది మైఖేల్ జాక్సన్ అకాల మరణంతో. మన కోరిక బలంగా ఉన్నప్పటికీ …… విధిరాత ముందు ఎవరైనా తల వంచాల్సిందే అని ఎన్నో సంఘటనలు రుజువు చేస్తూనే ఉన్నాయి.