
అమెరికాలో కలకలం చెలరేగింది. ఓ ట్రక్కులో 42 మంది మరణించడం సంచలనంగా మారింది. ఈ సంచలన సంఘటన అమెరికా టెక్సాస్ నగరంలో జరిగింది. అమెరికా సరిహద్దు ప్రాంతాల నుండి గతకొంత కాలంగా శరణార్థులు పెద్ద సంఖ్యలో ట్రక్కులో వస్తున్నారు. కాగా శాన్ ఆంటోనియోలో ట్రక్కులో వెళ్తున్న వారిలో 42 మంది మరణించగా 16 మంది ప్రాణాలతో బయటపడ్డారు. దాంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
మెక్సికన్ సరిహద్దు నుండి పెద్ద సంఖ్యలో అమెరికాలోకి శరణార్థులు వస్తున్నారు. అయితే అలా వస్తున్న వాళ్లంతా భారీ ట్రక్కుల్లో వస్తున్నారు. అసలే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న వేల ట్రక్కులో ఊపిరాడక మరణించి ఉంటారని భావిస్తున్నారు అమెరికా పోలీసులు.