
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూతబడింది. దాంతో ఒక్కసారిగా స్టార్టప్ కంపెనీలలో కలవరం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా టెక్ స్టార్టప్ కంపెనీలలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టే అమెరికా సంస్థ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ( SVB) మార్చి 10 న షట్ డౌన్ చేస్తున్నట్లుగా ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( FDIC ) ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా కలకలం మొదలైంది. 2008 లో తీవ్ర ఆర్ధిక సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. కట్ చేస్తే వాషింగ్టన్ మ్యూచువల్ తర్వాత అంతటి అతిపెద్ద బ్యాంక్ వైఫల్యం గా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంఘటన నిలిచింది.
SVB మూసివేతకు కారణం : నికర వడ్డీ ఆదాయం గతకొంత కాలంగా భారీ స్థాయిలో క్షీణించడమే SVB మూసివేతకు అసలు కారణం అని భావిస్తున్నారు. కీలక వడ్డీ రేట్ల ను పెద్ద ఎత్తున సవరించినప్పటికీ మెరుగైన ఫలితాలు సాధించలేక పోయింది. ఎస్ వి బి ఫైనాన్షియల్ గ్రూప్ చేసిన నిర్వాకం వల్ల సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కు ఈ పరిస్థితి ఎదురైనట్లు నివేదిక వెలువడింది.
అమెరికాలో 16 వ అతిపెద్ద బ్యాంక్ అయిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ గత ఏడాదిన్నర కాలంగా తీవ్ర సంక్షోభం నెలకొంది. దాంతో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగించాల్సి వచ్చింది. బ్యాంక్ ను గాడిలో పెట్టడానికి సున్నా వడ్డీ నుండి 5 శాతానికి పెంచినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దాంతో బ్యాంక్ ను మూసివేసినట్లు తెలుస్తోంది.