అమెరికాలో తాజాగా మధ్యంతర ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 435 ప్రతినిధులకు గాను రిపబ్లికన్ పార్టీ అత్యధికంగా 218 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక అధికార డెమో క్రాట్లు మాత్రం కేవలం 211 స్థానాలను మాత్రమే దక్కించుకున్నారు. దాంతో ప్రతినిధుల సభలో ఆధిపత్యం ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీదే అయ్యింది. అయితే మరో 6 స్థానాల్లో ఫలితాలు వెల్లడి కావల్సి ఉంది. ఆ ఆరు స్థానాల్లో మొత్తం స్థానాలను డెమోక్రాట్లు సొంతం చేసుకున్నా ఆధిపత్యం మాత్రం రిపబ్లికన్ పార్టీదే అవుతుంది. దాంతో రాబోయే రెండేళ్ల కాలం అధ్యక్షుడు జో బైడెన్ కు కష్టకాలం అనే చెప్పాలి.