అమెరికా మధ్యంతర ఎన్నికలలో హోరాహోరీ పోరు జరిగింది. ఆ పోరులో అధికార పార్టీకి చెందిన డెమోక్రాట్లు స్వల్పంగా లాభపడ్డారు. జో బైడెన్ వైఫల్యాలను అందిపుచ్చుకోవడంలో రిపబ్లికన్లు విఫలమయ్యారనే వాదన వినబడుతోంది. ఎందుకంటే జో బైడెన్ వైఫల్యాలను సరైన రీతిలో ప్రచారంలో వాడుకుంటే డెమోక్రాట్లు మరింత దారుణంగా నష్టపోయేవాళ్ళని కానీ డొనాల్డ్ ట్రంప్ అలాంటి పనులను చేపట్టలేదు కాబట్టే జో బైడెన్ నెత్తిన పాలు పోసినట్లు అయ్యిందని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే రిపబ్లికన్లు పూర్తి స్థాయిలో ప్రచారం చేయకపోయినా , జోబైడెన్ వైఫల్యాలను ఎంగడట్టకపోయినా ప్రజలు రిపబ్లికన్లకు మంచి స్థానాలనే కట్టబెట్టారు.
తాజాగా అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగగా ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాలకు గాను అధికార డెమోక్రాట్లు 213 స్థానాలను దక్కించుకున్నారు. ఇక ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ 221 స్థానాలను దక్కించుకొని పైచేయి సాధించింది. అలాగే సెనేట్ లో 49 స్థానాలను రిపబ్లికన్ పార్టీ దక్కించుకోగా 50 స్థానాలను డెమోక్రాట్లు సాధించుకున్నారు. దాంతో 2024 లో జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరింత రసవత్తరంగా పోరు సాగనుంది.