అమెరికా వెళ్లాలని ఆ దేశ వీసాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వాళ్లకు ఎట్టకేలకు శుభవార్త చెప్పింది అమెరికా. అయితే కరోనా మహమ్మారి కారణంగా వీసాల మంజూరు ను కట్టుదిట్టం చేసింది అమెరికా. దాంతో ఏకంగా 800 రోజులకు పైగా వెయిటింగ్ పీరియడ్ ఉండేది. దాంతో పెద్ద ఎత్తున భారతీయులు ఇబ్బంది పడ్డారు. చివరకు దౌత్య సిబ్బంది చేసిన ప్రయత్నాలు కొలిక్కి రావడంతో యూఎస్ వీసాల పునరుద్ధరణ జరిగింది …… అలాగే వెయిటింగ్ పీరియడ్ కూడా తగ్గింది.
యూఎస్ ఢిల్లీ కాన్సులేట్ లో 233 రోజులు పడుతోంది వీసా పొందడానికి . అలాగే ముంబైలో అయితే 297 రోజులు చెన్నై లో అయితే 171 రోజులు గరిష్టంగా పడుతోంది. ఈ రోజులను మరింతగా తగ్గించే ఆలోచన చేస్తున్నారు . భారతీయుల పట్ల కఠిన ఆంక్షలు ఉండటం వల్ల వీసాల గడువు ఎక్కువగా ఉంటోంది. మొత్తానికి భారత్ కృషి వల్ల వీసా కోసం నిరీక్షించే గడువు తగ్గింది. దాంతో పలువురు భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.