అమెరికా శుభవార్త తెలిపింది. అమెరికాలో ఏడేళ్ల పాటు ఉంటే వాళ్లకు గ్రీన్ కార్డు ( శాశ్వత నివాస హోదా ) ఇచ్చేలా సవరణ చేయడంతో అమెరికాలో ఉంటున్న విదేశీయులు చాలా సంతషంగా ఉన్నారు. ఇక ఈ నిర్ణయం వల్ల భారతీయులకు కూడా పెద్ద మొత్తంలో ప్రయోజనం చేకూరనుంది. అమెరికాలో ఏళ్ల తరబడి గ్రీన్ కార్డు కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు.
ఇమిగ్రేషన్ చట్టంలోని కొన్ని నిబంధనలను మార్చి డెమోక్రటిక్ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు సెనేట్ లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలో ఉంటున్న 80 లక్షల మందికి గ్రీన్ కార్డు లభించనుంది. అందులో భారతీయుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. దాంతో పలువురు భారతీయులు ఈ కొత్త బిల్లు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.