అగ్రరాజ్యం అమెరికాను హరికేన్ వణికిస్తోంది. ఫ్లోరిడా హరికేన్ భీభత్సంతో విలవిలలాడుతోంది. గంటకు 241 కిలోమీటర్లకు పైగా గాలులు వీస్తున్నాయి దాంతో ఫ్లోరిడా అతలాకుతలం అయ్యింది. భారీ వర్షాలకు భారీగా వరదలు రావడంతో దాదాపు 25 లక్షల మంది నిరాశ్రయు లయ్యారు. అలాగే వందల సంఖ్యలో మరణాలు సంభవించినట్లుగా భావిస్తున్నారు అధికారులు.
కరెంట్ లేకపోవడంతో కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు తెలుస్తోంది. భారీ వరదలు , భారీ వర్షాలు , ఈదురు గాలులు , కరెంట్ లేకపోవడం ఇలా అన్ని కష్టాలు ఫ్లోరిడాను నిలువెల్లా వణికిపోయేలా చేస్తున్నాయి. సముద్రంలో ఉండే మొసళ్ళు , షార్క్ లు ఇళ్లలోకి వచ్చేసాయి దాంతో మరిన్ని కష్టాలు వచ్చాయి ఫ్లోరిడా లో ఉంటున్న ప్రజలకు. సహాయం కోసం వేలాదిగా ఫోన్లు వస్తూనే ఉన్నాయని , కానీ సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు.