
అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు శుభవార్త తెలిపింది అమెరికా. కరోనా కష్టకాలం తర్వాత అమెరికా వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు భారతీయులు అలాగే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల వాళ్ళు. అయితే కొత్త వీసాలు మంజూరు చేయడంలో మాత్రం అమెరికా రిక్తహస్తమే అందిస్తోంది. దాంతో నెలల కొద్దీ వీసాల దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు.
అయితే అలాంటి వాళ్లకు శుభవార్త చెప్పింది అమెరికా. వీసాల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదని , ఎందుకంటే షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు లేవని కాకపోతే పర్యాటకులు అన్ని రకాల కేటగిరీ లలో అప్లయ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జనవరి నుండి వీసాల ఇంటర్వ్యూలు మొదలు కానున్నాయని ,ఈలోపు ఆన్ లైన్ లోనే అంతా జరుగుతుందని , నేరుగా అపాయింట్ మెంట్ మాత్రం కష్టమని తేల్చారు.