అమెరికాలో భారతీయులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలో ఓ భారతీయ కుటుంబంపై దాడి జరిగింది. ఇద్దరు దుండగులు తుపాకులు చేతబట్టి భారతీయ కుటుంబాన్ని కిడ్నాప్ చేసింది. వాళ్ళను ఏమి చేసారో తెలియక ? ఎవరు కిడ్నాప్ చేసారో తెలియక గందరగోళం నెలకొంది. అమెరికా పోలీసు అధికారులు భారతీయ కుటుంబాన్ని రక్షించేపనిలో పడ్డారు.
గతకొంత కాలంగా భారత్ కు చెందిన జన్ దీప్ సింగ్ , జస్లీన్ కౌర్ అమెరికాలో ఉంటున్నారు. ఆ దంపతులకు ఎనిమిది నెలల చిన్నారి సంతానం. జన్ దీప్ సింగ్ కాలిఫోర్నియా లోని మెర్సిడ్ కౌంటీ లో నివసిస్తున్నారు. సౌత్ హైవేలో ఓ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆ షాప్ లోకి చొరబడిన ఇద్దరు దుండగులు తుపాకీ ఎక్కుపెట్టి భార్యాభర్తలతో పాటుగా ఎనిమిది నెలల చిన్నారిని కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.