Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్ ను అందరూ ఖండిస్తున్నారు. ఆయన చేత సాయం అందుకున్న అందరూ బాబును కొనియాడుతున్నారు. విదేశాల్లో చదువుతున్న చాలా మంది విద్యార్థులు బాబుకు మద్దతుగా నిలుస్తున్నారు. బాబు అరెస్ట్ అక్రమం అంటూ నినదిస్తున్నారు. చంద్రబాబు కృషితోనే తాను అమెరికాలో చదువుతున్నానని ఒక విద్యార్థిని వడ్డెల్లి చరితశ్రీ వీడియో విడుదల చేసింది.
ఆమె మాట్లాడుతూ.. ‘నా పేరు వడ్డెల్లి చరిత శ్రీ .నేను మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వడ్డెల్లి సాంబశివరావు గారి మనవరాలు, నేను న్యూ జెర్సీలో ఎమ్మెస్ చదువుతున్నాను.’ అంటూ తెలిపింది.
2014 సంవత్సరంలో చంద్రబాబు గారు మా కాపు విద్యార్థులకు ఒక్కొక్కరికి 11 లక్షలు చొప్పున ఉపాధి కల్పించి సుమారు 2000 మందికి సహాయం చేశారు. ఇప్పుడు ఆ రెండు వేల మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
ఈ సైకో జగన్ వచ్చి విదేశీ విద్యను రద్దు చేశాడు. అన్యాయంగా అరెస్టు చేసిన చంద్రబాబు గారిని విడుదల చేయాలని అమెరికాలో ఉన్న కాపు విద్యార్థుల తరఫున కోరుకుంటున్నాము