అమెరికాలోలో ఎడిసన్ లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూజెర్సీ ఎడిసన్ లో ఉంటున్న ప్రవాసాంధ్రులు, అలాగే అమెరికాలో వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ఈ వసంత పంచమి వేడుకల కోసం సాయి దత్త పీఠం , శ్రీ శివ విష్ణు టెంపుల్ కు చేరుకున్నారు. వసంత పంచమి తెలుగు వాళ్లకు మరో ముఖ్యమైన పండుగ కావడంతో సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. అలాగే సరస్వతి అమ్మవారి ఆశీర్వాదం పొందారు. వసంత పంచమి సందర్భంగా పెద్ద ఎత్తున తమ పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేయించారు. ఈ వేడుకలు సాయి దత్త పీఠం ఫౌండర్ శంకరమంచి రఘు శర్మ నేతృత్వంలో జరిగాయి. ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఫోటోలు : డాక్టర్ శివకుమార్ ఆనంద్