యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( UAE ) లో గోల్డెన్ వీసా కావాలని ఆశపడుతున్న వాళ్లకు అక్కడి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ శుభవార్త గతంలోనే తీసుకున్నప్పటికీ కరోనా కారణంగా ఆలస్యమైంది. కట్ చేస్తే గోల్డెన్ వీసాల కోసం ఎదురు చూసే వాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది…… ఆంక్షలు తొలగించింది. UAE లో గోల్డెన్ వీసాదారులు కనీసం 20 కోట్ల రూపాయలను ఆ దేశంలో పెట్టుబడులుగా పెట్టాలి. ఈ మొత్తాన్ని లోన్ గా తీసుకోకుండా పెట్టాలి.
20 కోట్లను పెట్టుబడులు గా పెడితే కనీసం పదేళ్ల పాటు ఆదేశంలో వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ గోల్డెన్ వీసా మంజూరు చేస్తుంది అక్కడి ప్రభుత్వం. ఇక ఈ గోల్డెన్ వీసా దరఖాస్తు కు 50 దిర్హమ్స్ గా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీ లో 1090 రూపాయలు అన్నమాట. ఈ గోల్డెన్ వీసా పారిశ్రామిక వేత్తలకు , సెలబ్రిటీలకు , స్పోర్ట్స్ పర్సనాలిటీలకు అలాగే ఉన్నత విద్య కోసం అరబ్ కంట్రీస్ కు వెళ్ళేవాళ్లకు ఇవ్వనుంది UAE.