
వాషింగ్టన్ తెలుగు సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 న అట్టహాసంగా ఉగాది వేడుకలు అలాగే శ్రీరామనవమి వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వాషింగ్టన్ లోని రెడ్ మాండ్ హై స్కూల్ లో అచ్చతెలుగు సంప్రదాయంలో ఉగాది వేడుకలు జరుగనున్నాయి.అలాగే శ్రీరామనవమి వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలలో పాల్గొనే ప్రవాసాంధ్రులు సహపంక్తి భోజనాలు చేయనున్నారు. షాపింగ్ కోసం స్టాల్స్ కూడా ఏర్పాటు చేసారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా పంచాంగ శ్రవణం కూడా ఏర్పాటు చేసారు నిర్వాహకులు. ద్వాదశ రాశుల వారికి ఎలాంటి యోగం ఉందో వివరించనున్నారు. తెలుగు వాళ్లకు చాలా ముఖ్యమైన పండగ కావడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 1 నాటి ఉగాది వేడుకల కోసం , శ్రీరామనవమి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రవాసాంధ్రులు. మెగా రాయల్ , రాయల్ ఈ ఉత్సవాలకు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు.