అమెరికాలో అబార్షన్ చట్టం రద్దు కానున్నట్లు ఊహాగానాలు చెలరేగడంతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. అమెరికా సుప్రీం కోర్టు అబార్షన్ చట్టాన్ని రద్దు చేయబోతున్నట్లు ఓ డ్రాఫ్ట్ లెటర్ లీక్ కావడంతో ఈ ఆందోళన వ్యక్తం అవుతోంది.
జస్టిస్ శామ్యూల్ ఆలీటో రూపొందించిన ముసాయిదాలో ఈ అబార్షన్ రద్దు ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగాయి. 1973 లో రో వర్సెస్ వాడే కేసులో ఇచ్చిన తీర్పుని శామ్యూల్ తప్పుగా అభివర్ణిస్తున్నట్లు కథనం వెలువడుతోంది.