2024 లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో రిపబ్లికన్ పార్టీ తరుపున మళ్లీ డొనాల్డ్ ట్రంప్ పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే తనకు ఎదురులేదు అని అనుకుంటున్న సమయంలో తన పార్టీలోనే తనకు గట్టి పోటీ నిచ్చే నాయకుడు ర్యాన్ డి శాంటిస్ రూపంలో కనిపించడంతో ట్రంప్ ఆవేశానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. దాంతో అతడిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు ట్రంప్.
అమెరికాలో తాజాగా మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 15 లక్షలకు పైగా ఓట్లను సాధించి సంచలనం సృష్టించాడు ర్యాన్. ఫ్లోరిడా గవర్నర్ గా 2019 లో పదవీ బాధ్యతలు స్వీకరించాడు ర్యాన్ డిశాంటిస్. అతడు పదవి చేపట్టిన తర్వాత కరోనా విలయం విరుచుకుపడింది. దాంతో ఆ సమయంలో ర్యాన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు మంచి ప్రశంసలు కురిపించాయి. అలాగే కొన్ని విమర్శలను తెచ్చి పెట్టాయి. అయినప్పటికీ ర్యాన్ మాత్రం ఎక్కడా తగ్గకుండా ఫ్లోరిడా గవర్నర్ గా పరిపాలన సాగించాడు. అతడి పాలన పట్ల ఆకర్షితులైన అమెరికా ప్రజలు తాజాగా మధ్యంతర ఎన్నికలలో భారీ విజయాన్ని కట్టబెట్టారు.
దాంతో 2024 లో జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు గట్టి పోటీ నిచ్చి అతడ్ని పక్కన పెట్టడం ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ట్రంప్ ను ఎదుర్కొనే సత్తా ర్యాన్ కు లేదని అంటున్నారు. ఎందుకంటే ర్యాన్ రాజకీయాలకు కొత్త …… కాకపోతే భవిష్యత్ లో తప్పకుండా రిపబ్లికన్ పార్టీ అతడి చేతుల్లోకి వెళ్లడం ఖాయమని భావిస్తున్నారు.