అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో అధికార డెమోక్రాట్ లను ద్రవ్యోల్బణం బాగా దెబ్బ కొట్టినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రిపబ్లికన్లు విజయం సాధించడంతో పూర్తి స్థాయి ఫలితాలు వస్తే ఎలా ఉంటుందో నన్న భయం డెమోక్రాట్ లలో నెలకొంది.
అమెరికాలో 435 ప్రతినిధుల స్థానాలకు అలాగే 35 సెనేట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దాంతో ఇందులో మెజారిటీ స్థానాలు రిపబ్లికన్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని భావిస్తున్నారు. ఇలా జరిగితే జో బైడెన్ కు రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఇబ్బందులు తలెత్తడం ఖాయమని భావిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ద్రవ్యోల్బణం అని భావిస్తున్నారు. కరోనా యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఇక అప్పటి నుంచి ద్రవ్యోల్బణం అమెరికాను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. దాని ఫలితంగానే అమెరికా లోని పలు సంస్థలు తమ సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి.