
అగ్రరాజ్యం అమెరికాలో ఆర్ధిక మాంద్యం రానుందా ? అంటే అవుననే అంటున్నారు ఆర్ధిక రంగ నిపుణులు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ చెబుతున్న లెక్కల ప్రకారం రాబోయే ఏడాది ఆర్ధిక మాంద్యం తీవ్రత ఎక్కువగా ఉండనుందట. దీనికి ప్రధాన కారణం ఏంటో తెలుసా…….. వినియోగదారుల వ్యయం భారీ స్థాయిలో తగ్గిపోవడమే అలాగే వడ్డీ రేట్లు కూడా గణనీయంగా పెరిగిపోవడమేనని అంటున్నారు.
గతంలో 2007 తర్వాత ఆర్ధిక మాంద్యం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలపై పడింది. పలు బ్యాంక్ లు దెబ్బతిన్నాయి. అయితే భారత్ లో మాత్రం బ్యాంకింగ్ వ్యవస్థ పెద్దగా నష్టపోలేదు. అందుకు కారణం భారతీయులు ఎక్కువగా తమ డబ్బులను ఇంట్లో దాచుకోవడం లేదా భూములపై ఇతర రంగాలలో పెట్టుబడులు పెట్టడమే అందుకు కారణం. కట్ చేస్తే మళ్లీ ఇన్ని సంవత్సరాలకు ఆర్ధిక మాంద్యం యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది.
దాని ప్రభావంతో పలు సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను పెద్ద ఎత్తున తగ్గిస్తున్నాయి. అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా ఆర్ధిక మాంద్యంతో విలవిలలాడటం ఖాయమని భావిస్తున్నారు ఆర్ధిక నిపుణులు. అయితే భారత్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనే ఉత్సుకత నెలకొంది. కొంతమంది ఆర్ధిక నిపుణులు అయితే భారత్ ఆర్ధిక వ్యవస్థకు ఎలాంటి డోఖా లేదని అంటున్నారు.