వింజమూరి రాగసుధకు బ్రిటిష్ పార్లమెంట్ లో అరుదైన గౌరవం లభించింది. వింజమూరి రాగసుధ అందించిన సేవలకు గాను బ్రిటిష్ పార్లమెంట్ లో సత్కారం జరిగింది. ఈ సత్కార కార్యక్రమం ఏప్రిల్ 22 న బ్రిటిష్ పార్లమెంట్ లో జరగడం విశేషం.
ఈ సమావేశంలో భారత విదేశాంగ శాఖ , సాంస్కృతిక సహాయ మంత్రి మీనాక్షి కూడా పాల్గొనడం విశేషం. వింజమూరి రాగసుధకు బ్రిటిష్ పార్లమెంట్ లో సత్కారం జరగడంతో పలువురు ప్రవాస భారతీయులు రాగసుధని అభినందనలతో ముంచెత్తుతున్నారు.