అగ్రరాజ్యం అమెరికాలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మే 27 నుండి 29 వరకు మొత్తంగా మూడు రోజుల పాటు లక్ష్మీనరసింహస్వామి కల్యాణమహోత్సవం కన్నుల పండుగలా చేయనున్నారు.
ఈ వేడుకలకు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు హాజరుకానున్నారు. అలాగే ఉత్సవ మూర్తులను తీసుకురానున్నారు. ఈ వేడుకలు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరుగనున్నాయి. ఇక ఈ వేడుకలలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొననున్నారు.