అమెరికాలోని ఎడిసన్ లో గల సాయిదత్త పీఠం అండ్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా ఉత్సవాలు జరిగాయి. ఎడిసన్ లోని శ్రీ శివ విష్ణు టెంపుల్ ఆవరణలో ఈ ఉత్సవాలు జరుగగా పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎడిసన్ మేయర్ సామ్ జోషి హాజరయ్యారు.
నిత్యం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని , దాంతో జీవితకాల ప్రమాణం మరింతగా మెరుగు పడుతుందని , రకరకాల మానసిక రుగ్మతలను దూరం చేసే దివ్య ఔషధం యోగా అంటూ కీర్తించారు పలువురు ప్రముఖులు. యోగా చేయడం వల్ల ఎలాంటి జబ్బులను దూరం చేసుకోవచ్చో సవివరంగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ నిమ్మ , కెహిండె ఇబిటోలా, డాక్టర్ తుళిక కౌశిక్ , జైన్ , ఝాన్క్ న వర్మ , జగదీశ్ బాబు యలమంచిలి , డాక్టర్ ఆనంద్ , రఘు శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఫోటోలు : డాక్టర్ ఆనంద్