Aadasharma : అందం, అభినాయం కావాల్సినంత నటన ఉన్నా కానీ కొందరికి అవకాశాలు రావు. అలాంటి వారిలో ‘ఆదాశర్మ’ ఒకరు. ఎంత సంప్రదాయంగా కనిపించాలో అంతే గ్లామర్ ను కూడా చూపించగలదు. గతేడాది వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ హిట్టయినా.. ఈ భామకు ఇప్పటికీ సరైన బ్రేక్ రావడం లేదు. ఈమె కెరీర్ 3 అడుగులు ముందుకు.. 6 వెనక్కి అన్నట్టు తయారైంది.
బాలీవుడ్ భామ అదా లాస్ట్ ఇయర్ ‘ది కేరళ స్టోరీ’తో దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలో ఆదా నటన విమర్శకులను కూడా మైమరిపించింది. 2023 జాతీయ ఉత్తమ నటి అదా శర్మకే దక్కాలని క్రిటిక్స్ చెబుతున్నారు. ‘ది కేరళ స్టోరీ’లో షాలిని ఉన్ని కృష్ణన్‌గా ఆదా నటించింది. మతం మార్చుకొని ISIS చేతిలో బంధీ అయ్యే హిందూ యువతి పాత్రలో అదా నటన అందరితో కన్నీళ్లు పెట్టించింది.
ఆదా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కనిపించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘హార్ట్ ఎటాక్’తో టాలీవుడ్ ఆడియన్స్‌కు దగ్గరైంది. ఇక ఆమెకు సినిమాలు లేకపోయినా.. ఎప్పుడూ ఏదో ఒక ఫొటో షూట్‌తో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అదా తను చేసిన సినిమాల కంటే గ్లామర్ షోతోనే పాపులరైంది. ఇటు సినిమాలు చేస్తూనే అటు గ్లామర్‌తో ప్రేక్షకులను ఫిదా చేయడం అదా స్టయిల్. ‘ది కేరళ స్టోరీ’తో దేశ వ్యాప్తంగా పాపులరైంది.
‘హార్ట్ ఎటాక్’లో నితిన్ కలిసి నటించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా పర్వాలేదనిపించుకుంది. కానీ, ఈ భామకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో హాట్ ఫొటోషూట్స్‌తో పిచ్చెక్కిస్తుంది. బోలెడంత గ్లామర్ ఉన్నా.. ఈ భామకు మాత్రం సరైన అవకాశాలు మాత్రం రావడం లేదనే చెప్పాలి. అల్లు అర్జున్ తో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, సాయి ధరమ్ తేజ్ తో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ఆది సాయి కుమార్‌తో ‘గరం’, అడివి శేష్‌తో ‘క్షణం’, రాజశేఖర్‌తో ‘కల్కి’ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ బ్యూటీకి తెలుగులో అదృష్టం కలిసి రాకపోవడంతో హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టింది.
అదా శర్మ 1992, మే 11న ముంబైలో జన్మించింది. అక్కడే స్కూల్ అండ్ కాలేజీలో ఉన్నత విద్య అభ్యసించింది. మోడలింగ్‌లో అడుగుపెట్టింది. ఆపై సినిమాల్లో అవకాశాలను పట్టేసింది. అదా తండ్రి SL శర్మ మర్చంట్ నేవిలో కెప్టెన్‌గా పని చేశారు. ఆమె తల్లి క్లాసికల్ డాన్సర్. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అదా శర్మ. ముంబైలో విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. ఆమె నివసించే బంగ్లా కోట్లలో ఉంటుంది. ఆమెకు కోట్లాది రూపాయల ఆస్తులున్నాయి.
కేరళ స్టోరీకి అదా రూ. కోటి రెమ్యునరేషన్ అందుకుంది. ఆమె నికర విలువ దాదాపు రూ. 10 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఉంటూ గ్లామర్ షోతో ఆడియన్స్‌ను పిచ్చెక్కించింది ఈ భామ. ఈమెకు జమ్నాస్టిక్స్ లో ప్రవేశం ఉంది. డాన్సుల్లో కథక్, భరత నాట్యంలో ప్రావీణ్యం ఉంది. తొలి మూవీ అవకాశం వచ్చినా.. మరో అవకాశం కోసం దాదాపు 6 ఏళ్లకు పైగా వెయిట్ చేయాల్సి వచ్చింది. కేవలం సినిమాల్లోనే కాదు.. వెబ్ సిరీస్.. షార్ట్ ఫిల్మ్స్‌తో పాటు.. మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించి ప్రేక్షకులను అలరించింది.