
Arjun Reddy beauty glamorous treat : షాలినీ పాండే.. ఈమె పేరు చాలా మందికి తెలియదు.. అయితే అర్జున్ రెడ్డి హీరోయిన్ అంటే మాత్రం ఇట్టే గుర్తు పడతారు.. విజయ్ దేవరకొండ, షాలినీ పాండే జంటగా నటించిన సెన్సేషనల్ మూవీ అర్జున్ రెడ్డి.. ఈ సినిమాతో ఈ ఇద్దరు కూడా భారీ సక్సెస్ అందుకున్నారు.. అయితే ఇద్దరి ఫేమ్ మాత్రం ఒకేలా లేదు.. విజయ్ స్టార్ హీరోగా అయిపోతే షాలినీ మాత్రం అంతగా రాణించలేక పోతుంది..
ఈ సినిమా ఎంత హిట్ అయిన ఈమె కెరీర్ కు మాత్రం ఉపయోగ పడలేదు.. అర్జున్ రెడ్డి సూపర్ హిట్ అయిన తర్వాత 118, మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి సినిమాల్లో మెరిసింది. అయిన కూడా ఈమెను పెద్దగా పట్టించు కోలేదు. దీంతో ఈమె బాలీవుడ్ లో అవకాశం రావడంతో వెళ్ళిపోయింది.
దీంతో ఈమె బాలీవుడ్ కు చెక్కేసింది.. అక్కడైనా వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ అయిపోదాం అనుకుంది.. పాపం అమ్మడి ఆశలు నిరాశ అయ్యాయి. ఇక ఇటీవలే ఈమె అనుష్క నిశ్శబ్దం సినిమాలో కూడా కనిపించింది. ఇది కూడా నిరాశ పరచడంతో ఈమె కెరీర్ అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయింది.
అందుకే ఈమె అవకాశాల కోసం సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది.. ఇక్కడే కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించు కుంటుంది.. తాజాగా ఈ రోజు ఈ అమ్మడు రెడ్ కలర్ టైట్ డ్రెస్ లో గ్లామరస్ గా కనిపించి అందరిని ఫిదా చేస్తుంది.. ఈ గ్లామరస్ ట్రీట్ తో సోషల్ మీడియాను మరింత హీటెక్కించింది. ఇక బాలీవుడ్ లో అడపాదడపా అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
View this post on Instagram