Balayya Heroine : తొమ్మిది సంవత్సరాల కిందట బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ హీరోగా నటించిన మిర్చి లాంటి కుర్రోడు‘ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ప్రగ్యా జైస్వాల్. ఈ మూవీ అంత పెద్దగా హిట్ కాలేదు. వరుణ్ తేజ్ తో కలిసి కంచె మూవీ లో కూడా హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మకు మంచి పేరు తీసుకు వచ్చింది.
కంచె మూవీలో రాచకొండ సీతాదేవిగా అద్భుతమైన యాక్టింగ్ తో అదరగొట్టింది. ఆ తర్వాత ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయిక, ఇలా వరుసగా చేసిన సినిమాలు చేస్తూ తెలుగులో బిజీ యాక్టర్ గా మారిపోయింది. అయితే ఎక్కువగా సెకండ్ హీరోయిన్ రోల్స్ చేయడంతో పెద్దగా ఫేమస్ కాలేకపోయింది. దీనికి తోడు వరుస ప్లాప్ లు ప్రగ్యాను స్టార్ హీరోయిన్ ను కాకుండా వెనక్కి నెట్టాయ. రెండేళ్ల కిందట రిలీజ్ అయిన అఖండ మూవీ సూపర్ బ్రేక్ త్రూ ఇచ్చింది.
వరుస ప్లాఫ్ లతో ప్రగ్యాను స్టార్ హీరోయిన్ ను చేయలేకపోయాయి. రెండేళ్ల కిందట వచ్చిన అఖండ ఈ బ్యూటీకి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రగ్యా ఐపీఎస్ ఆఫీసర్‌గా, బాలయ్యకు భార్యగా యాక్టింగ్ కుమ్మేయడంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
అదే ఏడాది మోహన్ బాబు హీరోగా నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమాలో కీలక రోల్ ప్లే చేయగా.. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. కాగా అనంతరం ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. హిందీలో మాత్రం ఖేల్ ఖేల్ మేయిన్ అనే సినిమాలో నటించగా.. రెండు రోజుల కిందట ఈ మూవీ విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. కాగా తాజాగా ఇన్ స్టాలో ప్రగ్యా జైస్వాల్ చేసిన పోస్టు తెగ వైరల్ గా మారింది. మొత్తం మీద డెనిమ్ డ్రెస్ వేసుకుని హాట్ హాట్ గా కనిపించడంతో కుర్రకారు తెగ పొగిడేస్తున్నారు.