project k పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు అసలే నిరాశలో ఉన్నారు. బాహుబలి తర్వాత అసలు హిట్ పడలేదు ప్రభాస్ కు. భారీ అంచనాలతో బడా బడ్జెట్ తో వస్తున్న సినిమాలు అన్నీ దారుణంగా ప్లాప్ అయ్యాయి. ఇక ఎన్నో అంచనాలతో వచ్చిన ఆదిపురుష్ మూవీ తీవ్రంగా విమర్శల పాలు అయింది. ప్రభాస్ లుక్ మీద ఎన్ని ట్రోల్స్ వచ్చాయో చూశాం.
ఈ క్రమంలోనే ప్రాజెక్ట కే నుంచి అప్ డేట్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇక ఎంతగానో వెయిట్ చేసిన అభిమానులకు ఈ సినిమా నుంచి నిన్న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. చెప్పా పెట్టకుండా సడెన్ గా రిలీజ్ చేసి షాక్ ఇద్దామనుకున్నారు. కానీ ఆ లుక్ చూసిన వారంతా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసరికి మూవీ టీమ్ దెబ్బకు అలెర్ట్ అయింది.
ఐరన్ మ్యాన్ గా ప్రభాస్ ను చూపించాలని అనుకుని.. ఎడిటింగ్ కూడా సరిగ్గా చేయకుండా వదిలారంటూ తిట్టిపోశారు అభిమానులు. దాంతో మూవీ టీమ్ తమ తప్పును సరిదిద్దుకుని.. ఆ పోస్టర్ ను డిలీట్ చేసి.. తాజాగా తెల్లవారు జామున మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ లుక్ మరింత కాస్త డీసెంట్ గాఎడిటింగ్ చేసి వదిలారు.
ఇది కాస్త పర్వాలేదు అన్నట్టు ఉంది. ఇక ఈ లుక్ లోనే మరో అప్ డేట్ ఇచ్చారు. ఈ రోజు అమెరికాలో ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయనున్నారు. అంటే రేపు మన ఇండియాలోకి వస్తుందన్నమాట. ఇక ఫస్ట్ గ్లింప్స్ లో ప్రభాస్ వర్జినల్ లుక్ కనిపించే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు అభిమానులు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి బడా స్టార్లు కూడా నటిస్తుండటంతో అంచనాలు పీక్స్ కు వెళ్లిపోయాయి.
20 hours to go 💥
The Hero rises. From now, the Game changes 🔥
This is Rebel Star #Prabhas from #ProjectK.
First Glimpse on July 20 (USA) & July 21 (INDIA).
To know #WhatisProjectK stay tuned and subscribe: https://t.co/0EiA3RMlm5…@SrBachchan @ikamalhaasan… pic.twitter.com/G4McU7oAuS
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023