Gopichand’s wife, Background Shocked : మ్యాచో స్టార్ గోపీచంద్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇప్పుడంటే వరుస ప్లాప్స్ తో రేసులో వెనుకబడ్డాడు కానీ ఇంతకు ముందు మాత్రం మినిమమ్ గ్యారెంటీ సినిమాలతో టాలీవుడ్ యంగ్ హీరోస్ లో టాప్ లో ఉండే వాడు. గోపీచంద్ తొలివలపు సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.. ఈ సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ విలన్ అవతారం ఎత్తాడు గోపీచంద్.. జయం, వర్షం సినిమాల్లో విలన్ రోల్స్ లో నటించి హీరో కంటే విలన్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.. అయితే ఈ రెండు సినిమాల తర్వాత మాత్రం గోపీచంద్ విలన్ వేషాలు వేయలేదు..
మళ్ళీ హీరోగా వరుస సినిమాలు చేసాడు. 2004లో చేసిన యజ్ఞం సినిమా 2005లో చేసిన ఆంధ్రుడు సినిమాలు మంచి విజయం సాధించాయి.. ఈ సినిమాలతో హీరోగా ఫిక్స్ అయిపోయాడు గోపీచంద్.. ఆ తర్వాత అనేక విజయాలను తన ఖాతాలో వేసుకోగా ఇటీవల మళ్ళీ ప్లాప్ సినిమాలతో సతమతం అవుతున్నాడు. రీసెంట్ గా రామబాణం సినిమాతో వచ్చి పర్వాలేదు అనిపించుకున్నాడు.
ప్రజెంట్ భీమా సినిమా చేస్తున్న ఈయన ఈ సినిమాతో అయిన సూపర్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈయన భార్య గురించి చాలా మందికి తెలియదు.. గోపీచంద్ తన మేనకోడలునే పెళ్లి చేసుకున్నాడు.. ఈమె పేరు రేష్మ.. 2013, మే 13న వీరి వివాహం ఘనంగా జరిగింది.. ఇక ఇప్పుడు గోపీచంద్ కు ఇద్దరు పిల్లలు.. ఈయన పెళ్లి జరిగి 10 ఏళ్ళు కావడంతో ప్యారిస్ లో ఈఫిల్ టవర్ దగ్గర గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నాడు.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి..
|
ReplyForward
|






