యూకే పార్లమెంట్ లో నటి రాధికకు సన్మానం జరిగింది. ఉమెన్స్ సెలబ్రేషన్స్ -2022 పురస్కారాలలో భాగంగా నటి రాధికకు ఈ గౌరవం దక్కింది. యూకే పార్లమెంట్ సభ్యురాలు మారియా మిల్లర్ నేతృత్వంలో ఈ వేడుకలు జరిగాయి. యూకే పార్లమెంట్ లో తనకు పురస్కారం లభించడం పట్ల పరవశించి పోతోంది రాధిక. తనని ఈ సత్కారానికి ఎంపిక చేసిన సెలెక్టర్ లకు , యూకే ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపింది.
హీరోయిన్ గా సంచలన విజయాలు అందుకున్న రాధిక ఆ తర్వాత నిర్మాతగా కూడా మారి పలు సినిమాలను నిర్మించింది. సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి కానీ సీరియల్స్ మాత్రం బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. రాడాన్ అనే సంస్థని నెలకొల్పి పలు విభిన్నమైన సీరియల్స్ ని తమిళ్ లో నిర్మించింది. అంతేకాదు వాటిలో నటించింది కూడా. అవి అన్ని కూడా తెలుగులో కూడా డబ్ అయ్యాయి. ఇక ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.