Sreeleela: టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల మళ్లీ జోరు చూపిస్తున్నది. గుంటూరు కారం సినిమా తర్వాత మరే సినిమాకు కమిట్ కానీ శ్రీలీల మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నది. ఇటీవల శ్రీలీల పలువురి హీరోల సినిమాలను రిజెక్ట్ చేస్తూ వస్తున్నదని రూమర్లు వినిపిస్తున్నాయి. ఇందులో తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమాలో స్పెషల్ సాంగ్ ను ప్రొడ్యూసర్ ఆఫర్ చేయగా శ్రీలీల రిజెక్ట్ చేసిందని కొద్ది రోజుల క్రితం హాట్ న్యూస్ బయటకు వచ్చింది. అలాగే రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో ముందుగా శ్రీలీలను ఓకే చేయగా, ఆమె స్థానంలో జాన్వీ కపూర్ ఎంటరైంది. దీంతో శ్రీలీల రామ్ చరణ్ సినిమాను కూడా రిజెక్ట్ చేసిందా అనే టాక్ వినిపించింది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సినిమాతో పాటు మరో టాలీవుడ్ హీరో సినిమా నుంచి కూడా తప్పుకున్నట్లు తెలుస్తున్నది.
తనదైన డ్యాన్స్ లతో హీరోలకే సవాల్ విసరుతున్నది. ఈ క్రమంలో బాలీవుడ్ నుంచి కూడా శ్రీలీలకు ఆఫర్లు వస్తున్నాయని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ధావన్ డైరెక్షన్ లో స్టార్ హీరో వరుణ్ ధావన్ సినిమాలో శ్రీలీల ను కాంటాక్ట్ అయ్యారని గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేయలేక శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తున్నది. హీరోయిన్ బడ్జెట్ ఖరారు కాకపోవడంతో హీరోయిన్ గా ఈ సినిమాలో ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదని ప్రొడ్యూసర్ రమేష్ తురాని క్లారిటీ ఇచ్చారు. శ్రీలీలని హీరోయిన్ గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నామని రమేష్ తురాని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
శ్రీలీల చేతిలో ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఓ హిందీ చిత్రం కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. తెలుగులో ‘రాబిన్ హుడ్’ అనే సినిమాలో నితిన్ కు జోడిగా చేస్తున్నది. అలాగే తనకు సూపర్ హిట్టిచ్చిన రవితేజతో ఓ సినిమా చేస్తున్నది. పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో హీరోయిన్ శ్రీలీలనే. ఈ సినిమా షూటింగ్ దాదాపు సగం పూర్తయింది. శ్రీలీల హిందీలో ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. వీటితో పాటు శ్రీలీల ఓ తమిళ సినిమాకు సైన్ చేసినట్లు టాక్. విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ సినిమా నుంచి శ్రీలీల తప్పుకుందని టాక్. త్వరలోనే వీటన్నింటి పై ఓ స్పష్టత రానున్నది.