Sri Krishna Janmastami: శ్రావణం ఆధ్యాత్మిక మాసం. ఈ నెలలోనే ఎక్కువ శుభదినాలు ఉంటాయి. నాగ పంచమితో పండుగలు మొదలవుతాయి. ఇందులోనే శ్రీ కృష్ణ జన్మాష్టమి కూడా వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. శ్రావణ కృష్ణపక్షంలోని అష్టమి రోజు నిర్వహించుకుంటారు. ఈ రోజు విశ్వ గురువు శ్రీ కృష్ణ భగవానుడిని భక్తులు పూజిస్తారు. అయితే, ఆయనను కొలవాలంటే ఎలా అని చాలా మందికి సందేహాలు ఉంటాయి. వారి కోసం..
శ్రీకృష్ణ పూజ చేసేవారు ఉత్తర దిక్కున దీపం పెట్టాలి. బియ్యం పిండితో భగవానుడి ప్రతిమను తయారు చేసింది పసుపు, కుంకుమతో అలంకరించాలి. ఇలా చేయడం వల్ల చిన్ని కృష్ణుడు సంతోషిస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజు కొన్ని వస్తువులు దానం ఇస్తే గోపబాలుడి అనుగ్రహం ఉంటుందని అంటున్నారు. మరి ఏఏ వస్తువులు దానం చేయాలంటే..?
గోదానం..
శ్రీకృష్ణుడికి గోపాలుడు అని పేరు కూడా ఉంది. ఆ పరమాత్ముడికి గోవులంటే చాలా ఇష్టం. ఈ రోజున గోదానం చేయడం వల్ల పుణ్యం వస్తుందని
పండితులు చెబుతున్నారు. గోదానం చేయలేని వారు గో సేవ చేస్తే మంచిదని చెప్తున్నారు. గోవుకు ఇష్టమైన ఆహారం అందించడం వల్ల శ్రీకృష్ణుడు సంతృష్టుడు అవుతాడు.
నెమలి ఈకలు
నెమలి పించం ధారి అయిన శ్రీ కృష్ణుడిని చూస్తే నెమళ్లు పరవశించి ఆడుతాయి.
వాటిలో భక్తులు చిన్ని కృష్ణయ్యను చూసుకుంటారు. పూజా మందిరాన్ని నెమలి ఈకలతో అలంకరిస్తారు. ఈ నెమలి ఈకలను దానం చేయడం వల్ల కూడా పుణ్యం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.
దుస్తుల దానం..
కృష్ణాష్టమి రోజు ప్రత్యేక పూజలు చేయడంతో పాటు పేదలకు దానం చేయడం వల్ల పుణ్యం దక్కుతుంది. పేదలకు నిత్యావసరాలైన దుస్తులు దానం చేయడం వల్ల మంచిది. ఇలా చేస్తే శ్రీకృష్ణుడు సంతోషిస్తాడు. అందువల్ల పేదలకు వస్త్ర దానం చేస్తే కన్నయ్య అనుగ్రహం పొందుతారు.
వెన్న వితరణ..
కృష్ణుడిని వెన్నెదొంగ అంటారు. వెన్న అంటే కృష్ణుడికి ఇష్టం. ఈ రోజు పేదలకు వెన్నదానం చేయడం మంచిది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకు వెన్న ఇవ్వడం వల్ల సంతోషం కలిగించిన వారం అవుతాం. వారిపై శ్రీకృష్ణుడి అనుగ్రహం ఉంటుంది. దానం చేసిన వారి ఇంట్లో సంతోషం వెళ్లి విరుస్తుంది.