
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా గుర్తింపు పొందాడు.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈయన పాన్ ఇండియా స్టార్ గా మాత్రమే కాకుండా గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. ఈ మెగా హీరో నటనకు, ఛరిష్మాకు హాలీవుడ్ సైతం ఫిదా అయ్యింది.. ఇక ఈ సినిమాకు ఆస్కార్ కూడా రావడంతో ఈ హీరో మరింత పాపులర్ అయ్యాడు అనే చెప్పాలి.
ఆర్ఆర్ఆర్ సంచలన సినిమా తర్వాత చరణ్ మరో అగ్ర డైరెక్టర్ తో తన నెక్స్ట్ సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ షూటింగ్ దడపా చివరి దశకు కూడా చేరుకుంది. ఎస్ ఎస్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ”గేమ్ ఛేంజర్”.. ఈ సినిమాను నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మరింత ఆసక్తి పెంచేసాయి..
ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ కొద్దిగా గ్యాప్ ఇవ్వడంతో రామ్ చరణ్ ఫ్రీ అయ్యాడు.. త్వరలోనే తనకు బిడ్డ పుట్టబోతున్న నేపథ్యంలో చరణ్ చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నాడు.
ఇదిలా ఉండగా తాజాగా చరణ్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పిక్ లో చరణ్ మంచి ఫార్మల్ లుక్ లో క్లాస్ గా కనిపిస్తున్నాడు.. అలాగే స్టైలిష్ గా కూడా అనిపిస్తున్నాడు. బ్లాక్ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంటులో తలపై టోపీ పెట్టుకుని స్టైలిష్ గా నడుచుకుంటూ వెళ్తున్న పిక్ అంతర్జాతీయంగా వైరల్ అవుతుంది.. మరి ఇంకెందుకు ఆలస్యం మెగా పవర్ స్టార్ లేటెస్ట్ పిక్ పై మీరు ఓ లుక్కేయండి..