
టెలీకాస్ట్ మొదలైన తక్కువ సమయంలోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న సీరియల్ ‘బ్రహ్మముడి’.

ఈ సీరియల్ లోని నటులకు కూడా చాలా మందే అభిమానులు అయ్యారు. ఇందులో నటిస్తున్న అప్పు తెలుసుగా, మాస్ డైలాగ్స్ తో ఆకట్టుకుంటుంది.

అసలు ఆమె ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది..? లాంటి వాటి గురించి తెలుసుకుందాం.

అప్పు అసలు పేరు నైనిషా రాయ్.

కలకత్తాలో జన్మించింది. ఆమెకు బాల్య నుంచే నటనపై ఎక్కువ ఇంట్రస్ట్ ఉండేది.

దీంతో మాతృభాష బెంగాలీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది.

అనతి కాలంలోనే మంచి ప్రతిభ చూపింది. ఆ తర్వాత చదువుపై ఫోకస్ పెట్టడంతో నటనకు కొంత గ్యాప్ తీసుకుంది.

‘కొంచెం ఇష్టం-కొంచెం కష్టం’ సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత ‘శ్రీమంతుడు’, ‘హంస గీతం’, ‘భాగ్యరేఖ’, ‘ఇంటి గుట్టు’, ‘కలిసి ఉంటే కలదు సుఖం’ వంటి సీరియల్స్ లో నటించింది.

నైనిషా నటించిన సీరియల్స్ లో ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది మాత్రం ‘శ్రీమంతుడు’.






