AP Politics : ఏపీ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతు న్నాయి. గత ఎన్నికల సమయంలో వివేక హత్య, సీఎం జగన్ విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడి ఘటనలు రాష్ట్రంలో సంచల నం సృష్టించాయి.
ఇప్పుడు ఈ కేసుల్లో ప్రధాన నిందితులు దస్తగిరి ,శ్రీను పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. వీరిద్దరూ జై భీమ్ పార్టీలో చేరారు. ఇప్పటికే దస్తగిరి వైసిపి పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె కూడా రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
కేసులు ఆపై వేధింపులు ఎక్కువవుతున్న నేపథ్యం లో రాజకీయంలో ఉంటే అవి తక్కువ అవుతాయి అన్న ఉద్దేశంతోనే ఇద్దరు నిందితులు పార్టీలో చేరి నట్లు తెలుస్తోంది. వివేకాత్య కేసులో అప్రువర్ గా మారిన దస్తగిరి, ఆయన తండ్రి పై కూడా ఇటీవల దాడి జరిగింది.