
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా భావిస్తున్న విశాఖపట్టణంలో జి – 20 దేశాల సదస్సుకు రంగం సిద్ధమైంది. నాలుగు రోజుల పాటు 20 దేశాలకు చెందిన 57 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. యూరోపియన్ దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు అవుతుండటంతో 157 కోట్లతో సకల ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం.
ఇక ఈరోజు జరిగే సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నాడు. అమెరికా , అర్జెంటీనా , ఆస్ట్రేలియా , దక్షిణ కొరియా , దక్షిణాఫ్రికా , టర్కీ , యూకే , యూరోపియన్ యూనియన్ , సౌదీ అరేబియా , రష్యా , చైనా , ఇటలీ , జపాన్ , మెక్సికో , ఇండోనేషియా , ఫ్రాన్స్ , జర్మనీ , బ్రెజిల్ , కెనడా దేశాలతో పాటుగా భారత్ కు చెందిన పలువురు ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.
దేశ, విదేశాల ప్రతినిధులను ఆకర్షించడానికి , పెట్టుబడులు భారీ స్థాయిలో ఏపీ కి వచ్చేలా చేయాలడానికే భారీగా కసరత్తులు చేస్తోంది జగన్ ప్రభుత్వం. విదేశీ ప్రతినిధులను ఆకర్షించడానికి విశాఖపట్టణంను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసారు. ఇందుకోసం పూణే , కడియం ల నుండి పెద్ద ఎత్తున పూలు తెప్పించి అలంకరించింది రాష్ట్ర ప్రభుత్వం.