ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథ రెడ్డి (34) శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం లోని అవంతి అపార్ట్ మెంట్ లో ఈ సంచలన సంఘటన జరిగింది. మంజునాథ రెడ్డి తరచుగా ఈ అపార్ట్ మెంట్ కు వస్తుంటాడని , అలాగే రెండు రోజుల క్రితం ఈ అపార్ట్ మెంట్ కు వచ్చాడని , అయితే అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. మంజునాథ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు పోలీసులు.
Breaking News