ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వివిధ తరగతుల పిల్లలకు ట్యాబ్ లను అందించింది. పాఠశాల విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్ లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా 221 కోట్ల కుంభకోణం జరిగిందని …… ఆ సొమ్మును జగన్ మామ తినేసాడని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఇంతగా విమర్శలు రావడానికి కారణం ఏంటో తెలుసా………
మీ మేనమామను అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఈ ట్యాబ్ అమెజాన్ లో 11,999 /- రూపాయలకు మాత్రమే దొరుకుతుంది. అయితే ఇది ఒక్క ట్యాబ్ ధర . బల్క్ గా తీసుకుంటే దాదాపు ఒక్కో ట్యాబ్ మీద మూడు వేల రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉందట. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 5 లక్షల మందికి పైగా ఈ ట్యాబ్ లను అందిస్తున్నారు. అమెజాన్ సంస్థ నుండి ఈ ట్యాబ్ లను కొనకుండా బైజుస్ అనే సంస్థ ద్వారా తీసుకుంటున్నారు. దాంతో మొత్తం 5, 18,700 ట్యాబ్ లకు గాను ఒక్కొక్క ట్యాబ్ కు అత్యధికంగా 13,263 రూపాయల చొప్పున మొత్తం 688 కోట్లు వెచ్చించింది జగన్ ప్రభుత్వం.
అంటే ఒక్కొక్కదానికి 4263 రూపాయలు ఎక్కువగా చెల్లించారన్న మాట. దాంతో ఈ ట్యాబ్ లలోనే 221 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అందులో ఇదొకటి అన్నమాట. జనాలతో పాటుగా సోషల్ మీడియా కూడా కోడై కూస్తోంది ఈ వ్యవహారం గురించి.