3 రోజుల పాటు ఏపీలో మద్యం దుకాణాలు బంద్ చేస్తుండటంతో మద్యం బాబులు లబోదిబో మంటున్నారు. ఉత్తరాంధ్ర లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసి వేయాలని మద్యం షాపులకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ముందుగానే ఈ హెచ్చరికలు ఎందుకంటే ……. మద్యం ప్రియులు ముందుగానే తమ స్టాక్ కొనుక్కొని వెళ్లాలని సంకేతాలు ఇవ్వడం అన్నమాట. అయితే ఎక్కువమంది నిరుపేదలు , రోజు వారీ కూలీలు ఉంటారు అలాంటి వాళ్లకు మాత్రం ప్రభుత్వ నిర్ణయం శరాఘాతం అనే చెప్పాలి. ఎందుకంటే మూడు రోజులకు సరిపడా మందు వాళ్ళు కొనుక్కునే స్థోమత లేని వాళ్ళు కాబట్టి.
Breaking News