గుంటూరు లోని వికాస్ నగర్ లో జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మరణించిన సంగతి తెలిసిందే. దాంతో ఆ ముగ్గురు మహిళల కుటుంబాలకు 3 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లారు మన్నవ మోహన కృష్ణ.
దాంతో అక్కడి నుండే ఓ వీడియో విడుదల చేశారు. నిన్న గుంటూరు లోని వికాస్ నగర్ లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన ముగ్గురికీ నా వ్యక్తిగతంగా 3 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం చేస్తానని, ప్రస్తుతం అమెరికాలో ఉన్నానని, వచ్చాక ఆ కుటుంబాలను ఆదుకుంటామన్నారు. మన్నవ మోహన కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ఆర్ధిక సహాయం అందిస్తామన్నారు. అలాగే గాయపడిన వాళ్ళు త్వరగా కోలుకోవాలని, వాళ్లకు కూడా అండగా ఉంటామన్నారు.