పవన్ కళ్యాణ్ కు అంత్యంత ఆప్తుడు అయిన హాస్య నటుడు అలీ నేను పవన్ కళ్యాణ్ పై పోటీ చేయడానికి సిద్ధమంటూ ప్రకటించి సంచలనం సృష్టించాడు. హాస్య నటుడు అలీ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంతో ఇష్టం. అందుకే తన ప్రతీ సినిమాలో అలీ ఉండేలా చూసుకుంటాడు. అయితే పవన్ కళ్యాణ్ ను హీరోగా ఇష్టపడతాను కానీ రాజకీయ నాయకుడిగా కాదు అని అంటున్నాడు అలీ.
సినిమాలు వేరు రాజకీయాలు వేరు …….. మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే ఎక్కడ నుండైనా పోటీ చేయడానికి నేను సిద్ధం …… అవసరమైతే పవన్ కళ్యాణ్ పై పోటీ చేయడానికి కూడా నేను సిద్దమే ! అని ప్రకటించి సంచలనం సృష్టించాడు. అంతేకాదు రోజాకు మద్దతుగా వ్యాఖ్యానించి పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని విమర్శించాడు అలీ.
రోజా ను డైమండ్ రాణి అని పోల్చారు …….విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు తప్పకుండా ఉంటాయి అంటూ పవన్ కళ్యాణ్ కు హెచ్చరికలు జారీ చేసాడు అలీ. డైమండ్ అంటే ఎంతో విలువైంది……. కోహినూర్ వజ్రం ఎంత డిమాండ్ కలదో అని అంటున్నాము కదా ! అలాంటిదే రోజా అంటూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తాడు. ఇక పనిలో పనిగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు కూడా చేసాడు. అలీ కి ఆంధ్రప్రదేశ్ మీడియా వ్యవహారాల సలహాదారు పదవిని కట్టబెట్టాడు ముఖ్యమంత్రి జగన్. దాంతో మంచి జోష్ లో ఉన్నాడు. జగన్ మంచి పరిపాలన అందిస్తున్నాడని , మళ్ళీ గెలిచేది జగనే అని అంటున్నాడు. అలీ వ్యాఖ్యలపై తప్పకుండా కౌంటర్ పడటం ఖాయం …… ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా రియాక్ట్ అవ్వడం ఖాయం మరి.