
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023 ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. 2024 లో పార్లమెంట్ కు ఎన్నికలు ఉన్నందున ఇదే చివరి బడ్జెట్ కావడంతో దేశంలోని ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ ను రూపొందించినట్లు స్పష్టం అవుతోంది. ప్రజలందరినీ సంతృప్తి పరిచే బడ్జెట్ గా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. ఇక ఇదే సమయంలో విమర్శలు చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. వాటి సంగతి పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాలలోని గిరిజన వర్శిటీలకు 37 కోట్లు
ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి 47 కోట్లు
ఏపీ పెట్రోలియం వర్శిటీకి 168 కోట్లు
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు 683 కోట్లు
సింగరేణికి 1650 కోట్లు
ఐఐటీ హైదరాబాద్ కు 300 కోట్లు ‘
దేశంలోని 22 ఎయిమ్స్ దవాఖానలకు 6835 కోట్లు
దేశంలోని అన్ని మ్యూజియం లకు 357 కోట్లు
మణుగూరు , కోట భార జల కర్మాగారాలకు 1473 కోట్లు
వీటితో పాటుగా వేతన జీవుల కోసం ఆదాయపు పన్ను పరిమితిని 5 లక్షల నుండి 7 లక్షల వరకు పెంచడం విశేషం.