ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో ఇరుక్కుపోయింది. ఏకంగా తన పరిమితి మించి 98 శాతం అప్పులు చేసింది ఏపీ. దేశంలో అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రం ఏపీ నే ! మహారాష్ట్ర 45 వేల కోట్లు అప్పు చేయగా , తమిళనాడు , తెలంగాణ 50 శాతం వరకు అప్పులు చేసాయి. అయితే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను మించి ఏకంగా 98 శాతం అప్పు చేసి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది ఏపీ.
దాంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జగన్ సర్కారును తూర్పార బడుతోంది. అలాగే బీజేపీ ఏపీ నాయకులు కూడా జగన్ సర్కారు పై ఆగ్రహంగా ఉన్నారు. ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్ లో ఏపీ కి మరింత నష్టమని భావిస్తున్నారు ఆర్ధిక నిపుణులు.