
జగన్ ఒక సైకో …… ఆ సైకో ఊరికో సైకోను తయారు చేస్తూ ఏపీని సర్వ నాశనం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత . జగన్ ప్రభుత్వం పై పోరాటాన్ని తీవ్రతరం చేశారు చంద్రబాబు. తాజాగా జిల్లాల పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా కొవ్వూరు నుండి నిడదవోలు వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. చంద్రబాబు రోడ్ షోకు ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన లభించింది. దాంతో అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు జగన్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. జగన్ ను సైకో తో పోల్చడం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.