
సూపర్ స్టార్ కృష్ణ కు నివాళి అర్పించడానికి ఆంధ్రప్రదేశ్ నుండి బయలుదేరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్ లోని పద్మాలయా స్టూడియోస్ చేరుకోనున్నారు. కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించి , ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
కృష్ణ కుటుంబంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. దాంతో జగన్ కృష్ణ కు నివాళి అర్పించడానికి వస్తున్నారు. కృష్ణ పార్దీవ దేహాన్ని పద్మాలయా స్టూడియోస్ లో మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంచనున్నారు. ఆ తర్వాత 2 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరుగనున్నాయి. అలాగే అంత్యక్రియలకు కృష్ణ మనవడు అమెరికా నుండి వచ్చారు.